బోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

TRINETHRAM NEWS

బోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు – తెలుగుజాతి పెద్దఎత్తున జరుపుకొనే ఏకైక పండుగ సంక్రాంతి – భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంటుంది – తెలుగు వారెక్కడున్నా జన్మభూమికి వచ్చి సంక్రాంతి జరుపుకుంటాం – సంక్రాంతి పండుగకు మాత్రం మేము నారావారిపల్లె వెళ్తాం – సంక్రాంతి పండుగకు రావాలని పల్లె పిలుస్తోంది – పాత వస్తువులు, పనికిరానివి భోగి మంటల్లో వేయడం సంప్రదాయం – ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు – రాజధాని రైతులు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారు – చీకటి జీవోలన్నీ భోగి మంటల్లో వేసి తగలబెట్టాం – దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు – వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది – ఇవాళ్టి నుంచి 87 రోజులు వైసీపీకి కౌంట్ డౌన్ – రాజకీయ హింస, అక్రమ కేసులు, మోసపు హామీలను భోగి మంటల్లో వేశాం – పండుగ పూట కూడా అంగన్వాడీలు సమ్మె చేయాల్సిన పరిస్థితి – పేదవాడికి సంపద సృష్టించడమే ధ్యేయంగా టీడీపీ, జనసేన పనిచేస్తుంది – టీడీపీ-జనసేన అధికారం ఖాయమని ప్రజలు నిర్ణయించుకున్నారు – ప్రజావేదికతో విధ్వంసానికి జగన్ నాంది పలికారు – జగన్ కు.. ఐదేళ్లలో కూల్చడం తెలుసు.. నిర్మాణం చేతకాదు – చీకటి జీవోలతో రాష్ట్రాన్ని అంధకారం చేశారు – పేదలకు సంక్షేమ పాలన మళ్లీ అమరావతి నుంచే ప్రారంభం – ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడా లేవు – ఎన్నికల ముందు జగన్.. అమరావతే రాజధాని అన్నారు – ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నానని జగన్ చెప్పారు – అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల నాటకమాడారు – రాష్ట్రాన్ని మళ్లీ పునర్ నిర్మించుకోవాలి – రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీ-జనసేనది – ఇవాళ పండుగేమో భోగి.. పాలకుడేమో మానసిక రోగి – మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత

You cannot copy content of this page

Scroll to Top