ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినిలను అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల…
Trinethram News : విద్య రంగాన్ని నూతన విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని, విద్య వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మార్చి నెలలో వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికై హోటల్ ఆపరేషన్ గ్రూప్ నందు రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన ఎన్.శ్రావణి సత్య మరియు రాష్ట్రస్థాయిలో వివిధ ర్యాంకులు సాధించిన 12 మంది విద్యార్థినిలను ఎమ్మెల్యే గోరంట్ల ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
కళాశాల ప్రిన్సిపల్ ఎన్.ఎస్.వి.ఎల్ నరసింహం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలల కంటే దీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు అధిక శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి సూచనలతో విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ వారి సారథ్యంలో అనేక నూతన విద్య సంస్కరణలు చేస్తూ విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఉచిత పుస్తకాలు అందించడం, రాత పుస్తకాలు అందించడం, మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారని అన్నారు.
ఈ కాలేజీ నందు అనేక సౌకర్యాలు మెరుగు పడాల్సి ఉన్నప్పటికీ కూడా 75% ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేసిన ప్రిన్సిపల్ మరియు టీచర్లకు అభినందనలు తెలిపారు. కాలేజీ అభివృద్ధి విషయమై క్లాస్ రూములు పెంచాలని మరిన్ని సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి విద్యా శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, త్వరలోనే అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నామని అన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినిలు అందరూ పేద కుటుంబాలకు చెందిన వారిని, వారి తల్లిదండ్రులు రోజువారి కూలి వేతన పనులకు వెళుతున్నారని, చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించారని, విద్యార్థినిలు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
స్టేట్ షైనింగ్ స్టార్ ఎన్.శ్రావణి సత్యకు ఎమ్మెల్యే గోరంట్ల 4000/- రూపాయలు ఆర్థిక ప్రోత్సాహాన్ని, కళాశాల తరపున 3000/- రూపాయలు ఆర్థిక ప్రోత్సాహాన్ని, బిక్కిన రవి కిషోర్ శ్రీమతి మంజువేని ఇద్దరు విద్యార్థులకు 6000/- రూపాయలు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించారు. కాలేజీ తరఫున కాలేజ్ టాపర్ సౌమ్య శాలిని కి 1500/- రూపాయలు, మరో టాపర్ ఎం యశస్విని కి 1500/- రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీమతి డి.విజయశ్రీ, ధవలేశ్వరం కళాశాల ప్రిన్సిపల్ జే.వి సుబ్రహ్మణ్యం, కళాశాల ఇంచార్జ్ పి.త్రినాధరాజు, బి.రామకృష్ణ, బి.వి ప్రసాద్, ఏ.కళ్యాణ్ కుమార్, కె.మౌనిక, ఎన్.అరుణ స్థానిక నాయకులు బురా దుర్గాంజనేయులు, గొందేసి హరినాథ్ రెడ్డి, కొప్పిశెట్టి చిన్ని, నరసింహమూర్తి, ఏ.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


