Janasena : గత ప్రభుత్వం హయంలో గిరిజన యువతకు ఉద్యోగ గ్యారంటీ నాశనం చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు: జనసేన మండల అధ్యక్షుల ఆగ్రహం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 23: గత ప్రభుత్వం హయంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన యువతకు శత శాతం ఉద్యోగ ఉపాధి కల్పనకు తీసుకొచ్చిన జీఓ 3ని సుప్రీం కోర్టులో రద్దు చేసేందుకు దాఖలైన పిటిషన్‌పై వైసీపీ ప్రజాప్రతినిధులు నిష్క్రియగా వ్యవహరించారని మండల అధ్యక్షులు మండిపడ్డారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు—కొట్టగుళి భాగ్యలక్ష్మి (పాడేరు), విశాసారయి కళావతి (పాలకొండ), పాముల పుష్ప శ్రీవాణి (కురుపాం), నాగులపల్లి ధనలక్ష్మి (రంపచోడవరం), తెల్లం బాలరాజు (పోలవరం), పీడిక రాజన్న దొర (సాలూరు), ఎంపీ గొడ్డేటి మాధవి (అరకు)—గిరిజనుల హక్కుల పరిరక్షణకు కనీసం ప్రయత్నం చేయలేదని విమర్శించారు.
నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేస్తూ తమ స్వలాభం కోసం గిరిజనుల భవిష్యత్తును బలిగొట్టారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి జీఓ-3ను రక్షించడానికి చొరవ తీసుకోకుండా నిశ్శబ్ధంగా ఉన్నారని మండల అధ్యక్షులు ఆరోపించారు.
ప్రస్తుతం ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల్లో వైసీపీ నాయకులు అరుపులు, రంకెలతో బోల్తా పడుతున్నారని మండిపడ్డారు. “చేయాల్సిందంతా అప్పుడే చేయాలి. ఇప్పుడు మానవతా వాదం చూపడం అనవసరం,” అని అనంతగిరి మండల అధ్యక్షుడు చిట్టం మురళి, హుకుంపేట మండల అధ్యక్షుడు కోటేశ్వరరావు పడాల్, డుంబ్రిగూడ మండల అధ్యక్షుడు సీదరి ధనేశ్వరరావు, అరకువేలి మండల అధ్యక్షుడు అల్లంగి రామకృష్ణ, పెదబయలు మండల అధ్యక్షుడు కిల్లో బాబురావు స్పష్టం చేశారు.
గిరిజన ప్రాంతాల యువత భవిష్యత్ కోసం, వారి ఉద్యోగ అవకాశాల కోసం అప్పట్లో గళం వినిపించాల్సిన ప్రజాప్రతినిధులు మౌనం వహించడాన్ని గిరిజనులు మర్చిపోవడం లేదని మండల అధ్యక్షులు హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena Mandal Presidents are angry

You cannot copy content of this page

Scroll to Top