త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రెవిన్యూ జిల్లా మండల అధికారుల ఆధ్వర్యంలో అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక నందు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ భూముల నిర్వహణ భూముల రిజిస్ట్రేషన్ భూమి హక్కుల రక్షణలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిబద్దతగా ఆలోచించి ఈ చట్టానికి రూపకల్పన చేయటం జరిగిందన్నారు.
ఈ చట్టం ద్వారా భూములపై ఉన్న సందేహాలు వివాదాలు నివృత్తి చేస్తూ భూ యజమానులకు న్యాయమైన హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుందని పేర్కొన్నారు. న్యాయబద్ధంగా భూమి కలిగిన ప్రతిఒక్కరికి భద్రత కలిగేలా ఈ చట్టాన్ని రూపొందించారన్నారు భూభారతి రెవెన్యూ చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలను ఈ సందర్భంగా తెలియజేశారు.
భూ రికార్డుల పారదర్శకతను మెరుగుపరచడం భూములపై జరుగుతున్న వివాదాలను తొలగించడం, భూములకు సంబంధించిన సమాచారాన్ని డిజిటలైజేషన్ ద్వారా అందుబాటులోకి తేవడం, భూమి హక్కుల పరిరక్షణకు బలమైన చట్టబద్ధమైన ఆధారాన్ని కల్పించడం,ఇది ఒక పౌరునిగా మీ హక్కులు మీ చేతిలో పెట్టే చట్టం. అందుకే మనం అందరం ఈ చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ నిబంధనలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండేలా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


