తేదీ : 21/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ గ్రామీణ మండలంలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డుకు ఎంపిక అవడం జరిగింది. జాతీయ పంచాయతీ అవార్డు 2025 వ సంవత్సరంలో భాగంగా ఆత్మ నిర్భర్ పంచాయత్ విభాగంలో ఈ అవార్డు వచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సంచాలకులు కృష్ణ తేజ తెలిపారు. సొంత ఆదాయ వనరుల అభివృద్ధి విభాగంలో గొల్లపూడి గ్రామపంచాయతీ జాతీయస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


