Rains : మరో ఐదు రోజులు వానలే వానలు

TRINETHRAM NEWS

Trinethram News : మండు వేసవిలో జోరువాన బీభత్సం సృష్టించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్‌లో రహదారులు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్టు నెలకొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో హోర్డింగులు విరిగిపడ్డాయి.

అలాగే రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పంట నష్టం జరగడంతో… రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

వర్షానికి పదుల సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మొత్తంగా… అకాల వర్షం తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చింది.

ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలుచోట్ల వడగండ్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఏపీ, తెలంగాణ లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. అయితే.. వర్షాలు కురిసినప్పటికీ.. పగటిపూట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rains for another five

You cannot copy content of this page

Scroll to Top