P Prashanthi : ఇసుక సరఫరా విధానం ఏజెన్సీస్ జవాబుదారీతనం కలిగి ఉండాలి

TRINETHRAM NEWS

ఐవిఆర్ఎస్ ద్వారా వినియోగదారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నాం

ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి

రానున్న వర్షాకాలం దృష్ట్యా 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంచాలి

Trinethram News : రాజమహేంద్రవరం : జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి : రానున్న వర్షాకాలం దృష్ట్యా జిల్లాలో డెసిల్టేషన్, ఓపెన్ రిచెస్ , సెమీ మెకానైజ్డ్ పాయింట్స్ ద్వారా త్రవ్వకాలు చేపట్టి 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ను 45 రోజులలోగా గుర్తించిన స్టాక్ యార్డులలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన “ప్రామాణిక కార్యాచరణ విధానం” అనుసరించి ఇసుక స్టాక్ పాయింట్ ద్వారా ఏజెన్సీస్ వినియోగదారులకు సరఫరా చేసే ఇసుక ధర విషయంలో హేతుబద్ధత తప్పనిసరిగా కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.

శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇసుక సరఫరా విధానం పై ఏజెన్సీస్ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు , ఆర్డీవోలు ఆర్. కృష్ణ నాయక్ , రాణి సుస్మిత , జిల్లా మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ – బీవీ గిరి లతో కలిసి కలెక్టరు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంను దృష్టిలో ఉంచుకొని ముందస్తు గా నిర్మాణాలకి ఎటువంటి ఆటంకం లేకుండా తీసుకునే చర్యలలో భాగంగా జిల్లాలో స్టాక్ యార్డులను గుర్తించి అక్కడ ఇసుక నిల్వలను ఏర్పాటు చెయ్యడం జరుగుతోందని తెలిపారు. ఇందు కోసం ప్రభుత్వం గుర్తించిన లేదా ఏజెన్సీస్ గుర్తించిన స్థలాలలో ఆయా స్టాక్ యార్డు లకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏజెన్సీస్ స్వయంగా స్టాక్ యార్డు లను నిర్వహించేందుకు ముందుకు వొస్తే ఆమేరకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు సిద్దంగా ఉన్నారా అని కోరగా, స్వయంగా స్టాక్ యార్డు లను నిర్వహించేందుకు ఏజెన్సీస్ ప్రతినిధులు అంగీకారం తెలియ జేయడం జరిగింది.. రానున్న రెండు రోజులలో ఆమేరకు అంగీకారం, స్థలం వివరాలు వ్రాత పూర్వకంగా తెలియ చేయాలన్నారు. ఆయా భూములకు మార్గదర్శకాలు అనుసరించి అద్దె చెల్లించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియ చేశారు. ఏజెన్సీస్ స్వయంగా స్టాక్ యార్డు లను నిర్వహించేందుకు ముందుకు వొస్తే అందుకు అనుగుణంగా ఎన్ఫోర్స్మెంట్, పర్యవేక్షణా వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం ముఖ్యం అన్నారు. అదే ప్రభుత్వానికి అంద చేస్తే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.

రిజర్వు చేయబడిన ఇసుక నిర్దిష్ట సోర్స్ పాయింట్ వద్ద కార్యకలాపాల ఖర్చు ఆధారంగా జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా బేస్ రేటును నిర్ణయిస్తుందనీ , అంతకంటే ఎక్కువ ధరకు వినియోగదారునికి ఇసుక సరఫరా చేయడం ఉల్లంఘన కింద పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ధర నిర్ణయించే క్రమం లో మాన్యువల్ రీచ్/ సెమీ-మెకనైజ్డ్ రీచ్/ డి-సిల్టేషన్ పాయింట్ ఆధారంగా  ఏజెన్సీస్ గతంలో కోట్ చేసిన ధర ఆధారంగా ఉంటుందన్నారు. ఆయా రీచ్ పాయింట్స్ ఆధారంగా ధర భిన్నంగా ఉంటుందన్నారు.  వినియోగదారులకు ఇసుకను సరఫరా చేసే తుది ధర బేస్ రేటును అనుసరించి నిర్ణయిస్తామని తెలిపారు. జియో మ్యాపింగ్ ఆధారంగా కాకుండా రీచ్ పాయింట్స్ నుంచి స్టాక్ యార్డు వరకు ఉన్న దూరాన్ని వాస్తవంగా నిర్ధారణ చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు

ఇసుక సరఫరా విధానం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. వివిధ మార్గాలలో ఏజెన్సీస్ పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ఐ వి ఆర్ ఎస్ ద్వారా చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఏదైనా ఒక ఏజెన్సీస్ పై ఫిర్యాదులు వొస్తే వారే జవాబుదారీతనం కలిగి ఉండాలనీ స్పష్టం చేశారు. స్టాక్ పాయింట్ నిర్వహణ , అమ్మకాలు విషయంలో నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రజలకు, వినియోగదారులకు ఇబ్బందులూ లేకుండా ఏజెన్సీస్ సరఫరా విధానం లో చక్కటి పనితీరు చూపడం ముఖ్యం అన్నారు. రవాణా ఛార్జీలు నిర్ధారించే విషయంలో మధ్యస్థం గా ధర నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏజెన్సీస్ జవాబుదారీతనం కలిగి ఉండడం, అధికారులు అడిగే అంశాల పై తగిన వివరణ ఇవ్వడం తప్పనిసరి అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sand supply policy agencies s

You cannot copy content of this page

Scroll to Top