గత ఐదేళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి వెంటిలేటర్ పైనే ఉంది

TRINETHRAM NEWS
  • పది నెలల్లో ప్రక్షాళన చేశాం
  • రోజుకు 1500 మంది ఓపీ పేషెంట్లు వస్తున్నారు
  • ప్రజలకు నమ్మకం పెరిగింది
  • అకాల వర్షంతో ఆసుపత్రిలో అరగంట విద్యుత్ సరఫరా ఆగింది
  • వెంటనే విద్యుత్ పునరుద్ధరణ జరిగింది
  • పారాచ్యూట్ లీడర్, రీల్స్ స్టార్ భరత్ కు ప్రచారం పీక్ – మేటర్ వీక్
  • భరత్ ‌కోరుకునే కళలు వేరు
  • కూటమి ప్రభుత్వ‌ం నిర్వహించే కళలు కళాకారుల కోసం
  • మాజీ ఎంపీ భరత్ ను చెడుగుడు ఆడుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
    Trinethram News : రాజమహేంద్రవరం : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వెంటిలేటర్ మీద ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ప్రక్షాళన చేసి ఒక దారికి తెచ్చామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. ఈ పది నెలల్లో ఎమ్మెల్యేగా తాను 20 సార్లు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితి మెరుగు పరచడానికి కృషి చేశానని దాంతో 20 శాతం మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు. గత ఐదేళ్ళు ఎంపీగా ఉన్న పారాచ్యూట్ లీడర్, రీల్స్ స్టార్ భరత్ ఆసుపత్రిని సందర్శించకుండా గాడిదలు కాశాడా అని మండిపడ్డారు.
  • శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఒక నోడల్ అధికారిని నియమించేలా చేశామని చెప్పారు. ఆ అధికారి ఎప్పటికప్పుడు రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ మెరుగైన వైద్య ‌సేవలు కోసం చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. తాను కూటమి నాయకులు 15 రోజులకు ఒకసారి ఆసుపత్రిలోని ఏదో ఒక విభాగం సందర్శించి ఎక్కడ లోటుపాట్లు ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్న చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మార్చురీ వద్ద మృతుల బంధువులను కొందరు సిబ్బంది డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిసి వారిని గుర్తించి ఉద్యోగం నుంచి తొలగించేలా చేయగలిగామని ఆయన గుర్తు చేశారు. మరి ఇంతకాలం రీల్స్ స్టార్ భరత్ మార్చురీ వద్ద జరుగుతున్న అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిలదీశారు. పారాచ్యూట్ లీడర్, రీల్స్ స్టార్ భరత్ కు ప్రచారం పీక్… మేటర్ వీక్ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎద్దేవా చేశారు.
  • ఈ పారాచ్యూట్ లీడర్ భరత్ కు ప్రెస్ మీట్ పెట్టి తనను తిట్టడం తప్ప వేరేపని లేదని ఆక్షేపించారు. సమస్యలు ఉంటే నిర్మాణాత్మకంగా ఎత్తి చూపాలని కాని ప్రచారం పిచ్చితో నోటికొచ్చినట్లు అవాస్తవాలు మాట్లాడడం తగదని ఆయన హితవు పలికారు. గత వైసీపీ ప్రభుత్వం రూ. 2 వేల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టడం వల్ల కూటమి ప్రభుత్వం వాటిని చెల్లింస్తోందని‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. బకాయిల కారణంగా ఎక్కడా ఎన్టీఆర్ వైద్య ‌సేవలు ఆగలేదని ఆయన స్పష్టం చేశారు. తమ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అందుకే రోజూ ప్రభుత్వ ఆసుపత్రి ఓపీ వైద్య ‌సేవలు 1500 మంది పొందుతున్నారని, ఇందుకు వైద్యులను, సిబ్బందిని అభినందించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఇటీవల అకాల వర్షాలకు చెట్టు కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అరగంట సేపు విద్యుత్ సరఫరా నిలిచిందని దానిపై కూడా ప్యారా చ్యూట్ లీడర్ మార్గాని భరత్ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు.
  • ఆసుపత్రి ఐసోలేషన్ లో ఎక్కువగా ఒంటరిగా వచ్చిన వారు చేరుతుంటారని వారికి కూడా వైద్యులు వైద్య సేవలు అందిస్తుంటారని ఆయన చెప్పారు. తాను ఇంగ్లీషు స్పెల్లింగ్ తప్పు పలకడం వల్ల రాజమండ్రి నగరంలో ఎక్కడైనా అభివృద్ధి, సంక్షేమం ఆగిందా అని ఆయన మాజీ ఎంపీ భరత్ ను ప్రశ్నించారు. సీఎస్ఆర్ నిధులు ఇప్పటికే పేపరు మిల్లు నుంచి రూ. కోటి 20 లక్షలు వచ్చాయి, మరో రూ.40 లక్షలు రానున్నాయని ఆయన చెప్పారు.‌ మెడికల్ ఉద్యోగాలు పారదర్శకంగా వేస్తున్నామని, బయటి వారు ఎవరైనా తలదూర్చి బెదిరిస్తే ఎస్పీకి చెప్పాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. రాజమండ్రి నగరంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ లను అణచివేశామని, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఇందుకు సహకరిస్తున్న పోలీసు అధికారులను అభినందించారు. కళలకు కాణాచి రాజమహేంద్రవరంలో ఇటీవల అమరావతి చిత్ర కళావీధి నిర్వహించామని, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇలాంటివి ఏమైనా చేశారా అని ‌ఆదిరెడ్ఠి వాసు ప్రశ్నించారు. మాజీ ఎంపీ భరత్ కోరుకునే కళలు వేరని, తాము మాత్రం నిజమైన కళాకారుల కోసం కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
  • అంజలి విషయంలో ఆమె కుటుంబ సభ్యులను తాడేపల్లి తీసుకు వెళ్లిన భరత్ ఏమి న్యాయం చేశాడని ప్రశ్నించారు. తాను మాత్రం తమ భవానీ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ. 2 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చామని, మరింత మొత్తం వారికి అందేలా జనసేన రాజమండ్రి సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అంజలి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా దారినే వెళుతున్న విద్యార్థులను మాజీ ఎంపీ భరత్ బస్సులు దింపించి వారితో ఆందోళన చేయించాడని, తాము‌మాత్రం ఆ కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే జనసేన రాజమండ్రి సిటీ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Government hospital on ventilator

You cannot copy content of this page

Scroll to Top