తేదీ : 18/04/2025. అల్లూరి సీతారామరాజు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఈనెల 7వ తేదీన అల్లూరి జిల్లా, డుంబ్రిగూడ మండలం , పెదపాడు లో రాష్ట్ర డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. ఆ సమయంలో పాంగి.మిత్తు అని వృద్ధురాలు చెప్పులు వేసుకోకుండా వచ్చి పవన్ కు స్వాగతం పలికారు.
అప్పుడు కాళ్లకు చెప్పులు లేకపోవడంతో పవన్ గమనించి , చలించిపోయారు. తమ సిబ్బందికి చెప్పి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించి, మొత్తం మూడు వందల నలభై ఐదు మందికి చెప్పులు పంపించారు సిబ్బంది ఇంటింటికి వెళ్లి పాదరక్షలు పంపిణీ చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


