Jagan : దాల్మియా సిమెంట్స్ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ..జగన్‌ అక్రమాస్తుల కేసు

TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు తెలిపింది.

కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు లీజుకిచ్చింది. ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ గతంలోనే ఆరోపించింది. జగన్‌తో కలిసి దాల్మియా సిమెంట్స్‌ అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లు సీబీఐ 2013లో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

తద్వారా జగన్‌ సుమారు రూ.150 కోట్ల మేర అక్రమంగా లబ్ధి పొందినట్లు అందులో పేర్కొంది. రఘురామ్‌ సిమెంట్స్‌లో రూ.95 కోట్ల విలువైన షేర్లు, రూ.55 కోట్లు హవాలా రూపంలో దాల్మియా సిమెంట్స్‌ ఇచ్చినట్లు అభియోగం మోపింది. సీబీఐ ఛార్జ్‌ షీట్ ఆధారంగా మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా రూ.793 కోట్ల విలువైన అస్తులను అటాచ్‌ చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ED attaches Dalmia Cements

You cannot copy content of this page

Scroll to Top