Trinethram News : ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నూతన సబ్ స్టేషన్ ను స్థానిక ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ, వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం బిజెపి ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ హాజరై భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రూ. 2.66 కోట్లు అంచనా వ్యయంతో 33/11 విద్యుత్తు సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశామని, రాజానగరం పరిసర ప్రాంతాలలో విద్యుత్ అంతరాయాన్ని నిర్మూలించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
రాజానగరం నియోజకవర్గంలో విద్యుత్ అంతరాగాలను నిర్మూలించేందుకు ఎంతో కృషి చేస్తున్నామని దీనిలో భాగంగా రాజానగరం నియోజకవర్గ చరిత్రలో ఒకేసారి నాలుగు సబ్ స్టేషన్లు తీసుకువచ్చామన్నారు. నియోజకవర్గానికి సబ్ స్టేషన్లు మంజూరు చేయడంలో సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మరియు ఎనర్జీ మినిస్టర్, శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే ఆరు నెలల్లో రాజానగరం నియోజకవర్గంలో ఎక్కడ విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో సబ్ స్టేషన్ ఏర్పాటుకు సహకరించిన వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ కి ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఎంతో హానెస్ట్ గా పని చేస్తున్నారని, విశ్వవిద్యాల అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో శంకుస్థాపన చేస్తున్న సబ్ స్టేషన్ పనులు రెండు నెలల్లో పూర్తి కావాలని ఎలక్ట్రికల్ అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు.
ఈ సందర్భంగా వీసీ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని దీనికి సహకరిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మరియు నాయకులకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎక్కువ అనుబంధ కళాశాలలతో రాష్ట్రంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉందని అన్నారు. సొంత సొమ్ముతో స్థలాన్ని కొనుగోలు చేశారని, మరికొంత స్థలం ప్రభుత్వం నుండి రావాల్సి ఉందని, దానికి సహకరించి విశ్వవిద్యాలయ ప్రాంగణాల విస్తరణకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాజానగరం ప్రజలకు సబ్ స్టేషన్ నిర్మాణానికి విశ్వవిద్యాలయం స్థలం కేటాయించి భాగస్వామ్యం అయిందని, విశ్వవిద్యాలయ అభివృద్ధికి నాయకులు సహకరించి భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా విశ్వవిద్యాలయానికి ప్రత్యేక లైన్ కేటాయిస్తారని విశ్వవిద్యాలయంలో విద్యుత్ అంతరాయాలు కూడా ఇకపై తొలగిపోతాయని అన్నారు.
రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం బిజెపి ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి లు మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రశంసించారు. రాజానగరం నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా నాలుగు సబ్ స్టేషన్లు తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు దక్కుతుందని అభినందించారు. అనంతరం అతిధులను సాలువలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, విద్యుత్ శాఖ అధికారులు ఎస్.ఇ. కె తిలక్ కుమార్, రాజమహేంద్రవరం రూరల్ ఆపరేషన్స్ ఇ.ఇ. శ్రీధర్ వర్మ, ఇ.ఇ. ఎం రవి కుమార్, ఇ.ఇ. వై డేవిడ్, డి.ఇ. సన్యాసిరావు, ఏ.ఇ. సుధాకర్, ఎంపీడీవో ఝాన్సీ, స్థానిక అధికారులు నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


