Awareness Conference : అట్లవారి పల్లెలో చిరుధాన్యాలపై అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ అట్లా వారి పల్లె హరిజనవాడలో చిరుధాన్యాలపై అవగాహన సదస్సు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాలైనటువంటి రాగులు సజ్జలు కొర్రలు అరిసెలు పండించుకుని రైతులు లాభ పడొచ్చని తెలిపారు.

అలాగే ఒక ఎకరం వరి పంట వేయడానికి కావలసినటువంటి నీటితో ఐదు ఎకరాలు రాగి పంట పండించవచ్చని తెలిపింది. ఇందులో కలుపు నివారణ చర్యలు కూడా సులభంగా ఉంటుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో పెనుమూరు మండల ఏవో శ్రీనివాస్, ఏ ఈ ఓ తులసి, రామకృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ దూది వెంకటేష్, నరసింహారెడ్డి, చంద్రశేఖర్, లక్ష్మయ్య మరియు రైతులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Awareness conference on small grains

You cannot copy content of this page

Scroll to Top