CITU : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పున:స్థాపన చేయాలి సిఐటియు ఉమామహేశ్వర్ డిమాండ్

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 17 : రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునర్దించాలని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేసింది ఈ మేరకు బుధవారం అరకు వ్యాలీ గిరిజన సంఘం కార్యాలయంలో యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీ .కొండలరావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన బోర్డును గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు కాకుండా నిలిపివేసిందని తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తక్షణ బోర్డును పునర్దించి సంక్షేమ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఇతర రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని తెలిపారు మన రాష్ట్రంలో బిల్డింగ్ ద్వారా ఒక శాతం నిధులు బోర్డు లో జమ అయ్యేని రాష్ట్రంలో 4,298 కోట్లు ఉన్నట్లు కార్మిక శాఖ మంత్రి శాసన మండలి తెలిపారని అన్నారు తక్షణం ఆ నిధులు కార్మికుల సంక్షేమ కోసం పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు గత ఆరు సంవత్సరాలుగా కార్మికులు ఎటువంటి సంక్షేమానికి నోచుకోలేదని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డు పునర్దిస్తామని మేనిఫెస్టోలో పెట్టారని తెలిపారు నేటికీ పది నెలలు కావస్తున్న హామీ నెరవేర్చలేదని అన్నారు గత ప్రభుత్వం 12 14 మెమో తీసుకొచ్చి కార్మికులకు నష్టం చేకూర్చిందని తక్షణం మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇసుక కొత్త వాళ్ళ భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటువంటి కాలంలో అనేక మంది కార్మికులు మరణిస్తున్నారని ఒక రూపాయి కూడా నష్టపరిహారం లేకుండా పోయిందని తెలిపారు సమస్యలు పరిష్కరించాలని ఈనెల 24వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు అరకువేలి మండల కార్యదర్శిజె. భగత్ రాం యూనియన్ నాయకులు స్వామి నాయుడు, శ్రీను, రవి దాసు రాజేంద్ర, దొరబాబు సత్తిబాబు కార్పెంటర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్, సెంట్రింగ్, రాడ్ బెండింగ్ కార్మికులు, పెయింటర్స్, మేస్త్రిలు తదితర రంగాల నుండి కార్మికులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CITU Umamaheshwar demands restoration

You cannot copy content of this page

Scroll to Top