WhatsApp Image 2024 01 13 at 6.46.47 PM
రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు..
Trinethram News : సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. విద్యుత్ లైన్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని..
విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే మాంజాలు విద్యుత్ లైన్లపై, ట్రాన్సఫార్మర్లపై పడి ప్రమాదాలు, విద్యుత్ అంతరాయాలు కలిగే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడితే వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ ‘1912’కి సమాచారం ఇవ్వాలన్నారు.
