TRINETHRAM NEWS

Trinethram News : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిరిడి సాయి విద్యాసంస్థలకు చెందిన ఈశ్వర్ విద్యాలయ మాహిళా జూనియర్ కాలేజీ విద్యార్థినులు సత్తా చాటారు. శనివారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో సీనియర్స్,జూనియర్స్ విభాగాల్లో రాస్ట్ర,జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాల వివరాలను కళాశాల చైర్మన్ ఉమారాణి వెల్లడించారు. మొత్తం 289 మంది విద్యార్థులు మొదట, రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు రాయగా వారందరూ నూరు శాతం మొదట శ్రేణిలో ఉత్తమ ఫలితాలు సాధించారు.
జూనియర్ ఎంపీసీ విభాగంలో నర్సిపూడికి చెందిన మద్ది సీత సంజన 465/470 మార్కులతో జిల్లాలో మొదట స్థానం, రాష్ట్రంలో నాలుగవ స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే బైపిసి విభాగంలో మూలస్థాన అగ్రహారం చెందిన గోపి గంగా మాధురి 435/440 మార్కులతో జిల్లాలో మొదట స్థానం, రాష్ట్రంలో మూడో స్థానం దక్కించుకుంది. అలాగే హెచ్‌ఈజి విభాగంలో చొప్పెల్ల గ్రామానికి చెందిన ధర్మాసుల జయదుర్గ శ్రీవల్లి 466/475 మార్కులతో రాష్ట్రంలోనూ జిల్లాలోని మొదటి స్థానం కైవసం చేసుకుంది.
ఇక సీనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసి కి సంబంధించి చిలకలపాడు కు చెందిన దూలం సాయి వైష్ణవి 989/1000, బైపిసిలో నర్సిపూడికి చెందిన వర్ధనపు ప్రహర్షిణి 977/1000 మార్కులు రాగా హెచ్‌ఈజీ విభాగంలో లొల్ల గ్రామానికి చెందిన వాతల జ్యోతిర్మయ సాయి 953/1000 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు వాదించింది.
సీనియర్ ఇంటర్లో 1000 మార్కులు గాను 980 పైగా సాధించిన వారు ఆరుగురు ఉన్నారు. అలాగే 970 పైగా మార్కులు సాధించిన వారు 15 మంది,960 పైగా సాధించిన 27 మంది,950 పైగా మార్కులు సాదించిన వారు 31 మంది, 900 పైగా మార్కులు సాదించిన వారు 48 మంది, 800 పైగా మార్కులు శాంక్షన్ 71 మంది, 700 పైగా మార్కులు సాధించిన వారు 69 మంది ఉన్నారు.
జూనియర్ ఇంటర్మీడియట్ లో 464 మార్కులకు పైగా సాధించిన వారు ఇద్దరు ఉండగా 460 కు పైగా మార్కులు సాధించిన వారు నలుగురు,450 కు పైగా సాధించిన వారు 21 మంది ,440 పైగా సాధించిన వారు 32 మంది, 430 పైగా సాధించిన వారు 39, మంది,400 పైగా మార్కులు సాధించిన వారు 40 మంది,350 కు పైగా మార్కులు సాధించిన వారు 25 మంది ఉన్నారని ఉమారాణి తెలిపారు. ఈ మార్కులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Shirdi Sai students