KCR : వనజీవి రామయ్య మరణంపై కేసీఆర్ కీలక ప్రకటన

TRINETHRAM NEWS

Trinethram News : వనజీవి రామయ్య మరణంపై కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు అన్నారు. తెలంగాణ, ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని వెల్లడించారు కేసీఆర్.

వనజీవి మరణం పట్ల కేసీఆర్ సంతాపం తెలిపారు. పచ్చదనం పరిరక్షణకోసం వనజీవి కృషిని స్మరించుకున్న కేసీఆర్… పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు.

వృక్షో రక్షతి రక్షితః ” అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని అన్నారు.

మొక్కల పెంపకం కోసం వనజీవి గా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవి గా వారు చేసిన త్యాగం అసమాన్యమైనదని కేసీఆర్ అన్నారు. అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన.. తెలంగాణ కు హరిత హారం … ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య గారు అందించిన సహకారం గొప్పదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KCR's key statement on

You cannot copy content of this page

Scroll to Top