CPI : వంట గ్యాస్ ధరల పెంపుతూ సామాన్యులపై భారం

TRINETHRAM NEWS

సంపన్నులకు లాభం చేకూర్చే విధంగా మోడీ విధానాలు.
సిపిఐ పార్టీ డిండి మండలం.

డిండి (గుండ్లపల్లి)ఏప్రిల్ 11 త్రినేత్రం న్యూస్. కేంద్ర ప్రభుత్వం వంట చేస్తుంది అదనంగా పెంచడం వల్ల సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై మరింత ఆర్థిక భారం పడుతుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, జిల్లా సమితి సభ్యులు తోంబుచ్చిరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి శ్రీ రామదాసు కనుక చారి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపుదలకు నిరసనగా శుక్రవారం ఢిల్లీ మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో శ్రీశైలం -హైదరాబాద్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ చర్య మోల్గే నక్క పై తాటి పండు పడిన . చందంగా ఉందని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికి 500 పై గ్యాస్ సిలిండర్లు ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ధరలను పెంచుకుంటూ పోతుందని కేంద్రం కార్పొరేషన్ కంపెనీలకు బలపారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజల మీద ఆర్థిక భారం మోపుతుందని, ఎల్పీజీ సిలిండర్లపై సాధారణ వినియోగదారులకు ఇచ్చే 200 రూపాయలు సబ్సిడీని వెంటనే పునరుద్ధరించాలని అన్నారు.
శుద్ధమైన వంట గ్యాస్ కావాలని కోరుకోవడం విలాసం సొంతమైన జీవితం ఏమి కాదని అది ప్రజల మౌలిక అవసరం ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలు దేశంలో రోజురోజుకు అసమానతలను మరింత లోతుగా పెంచుతున్నాయని ఎల్పిజి పై 50 రూపాయల ధరను కేంద్రం పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు.
పెరిగిన భారాన్ని ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ సిలిండర్లు తీసుకున్న పేద లబ్ధిదారులపై పడేశారని ఉజ్వల పథకం కింద గ్యాస్ కలెక్షన్లు తీసుకున్న లబ్ధిదారులకు సిలిండర్ ధరను 500 నుండి 550 కి పెంచి వినియోగదారులకు చెల్లించే సిలిండర్ ధరను 83 నుంచి 8503 లకు పెంచారన్నారు.
ఇప్పటికే దేశంలో లక్షలాదిమంది ప్రజలు పెరిగిన ఆహార ద్రవ్యాలు బలం ఆదాయాలు తగ్గిపోవడం విందన ధరలు పెరుగుదల వంటి సమస్యలతో అక్కా వికలామవుతున్నారని ఇప్పుడు 50 రూపాయలు అదనపు భారం వేసి కార్మిక వర్గ జీవన భృతిపై మరోసారి దాడి చేయడమేనని ఆయన విమర్శించారు.
బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వంట గ్యాస్ సిలిండర్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ముడిచమ్మరు ధరలు చరిత్ర ఆత్మక స్థాయిలో శీనస్థాయిలో ఉన్నప్పుడు కూడా వంట గ్యాస్ ధరలు మన దేశంలో బాగా పెరిగాయని ముడిచామురు ధరల తరుగుదల వల్ల కలిగే ప్రయోజనాన్ని సామాన్య ప్రజలకు వర్తింపజేయకుండా చమురు కంపెనీలకు ప్రైవేటు కార్పోరేట్లకు కట్టబెట్టిన మోడీ ప్రభుత్వం ఎల్పిజి సబ్సిడీ వ్యవస్థను పూర్తిగా లేకుండా చేసిందని వారు అన్నారు.
దీనివల్ల పేదలు మధ్యతరగతి వర్గాలు మార్కెట్ వడిదొడ్ల బారిన పడి అతలాకుతలమవుతున్నారని అన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను పెంచిందని ఆర్థిక వ్యవస్థ సామాన్య వలయంలో చిట్టుకున్న తరుణంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఈ పరిస్థితుల్లో సామాన్య పేద ప్రజలపై భారాలు వేయవద్దని వారన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొల్లేష్, కార్యవర్గ సభ్యులు కేశవులు, నూనె వెంకటేశ్వర్లు, గోరేటి వెంకటయ్య, ఎలిమినేటి హుస్సేన్, నాయకులు శాఖ కార్యదర్శి లు వంకేశ్వరం చక్రి, శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్త, లక్ష్మారెడ్డి, వెంకటయ్య, ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షు లు సురిగిరి వినయ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Increasing cooking gas prices

You cannot copy content of this page

Scroll to Top