మహాత్మా జ్యోతి రావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచరణీయం..
ఎంపీడీవో వెంకన్న
డిండి (గుండ్లపల్లీ) ఏప్రిల్ 11 త్రినేత్రం న్యూస్. జ్యోతి రావు పూలే త్యాగాలను సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఒక సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటం గా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్షమన్నారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త , భావి తరాలకు సైతం మార్గ దర్శకుడు అని ,సమాజంలో వివక్షతకు తావు లేదని సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు అని,కొనియాడారు.
అంట రానితనంవున్నారోజుల్లో అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరోదాత్తుడు పూలే అని మండలపరిషత్ అభివృద్ధి అధికారి వెంకన్న అన్నారు. జ్యోతి రావు పూలె జయంతి ని పురస్కరించుకొని పూలే చిత్ర పటానికి పూలమాల సమర్పించారు.
ఈ కార్య క్రమంలో మండలప్రజా పరిషత్ సీనియర్ అసిస్టెంట్ శివానందం, జూనియర్ అసిస్టెంట్ వివేక్ కుమార్ ,నవీన్ కుమార్, శివాజీ , మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


