త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా సంగం డైరీ ఆద్వర్యంలో అనపర్తిలో బిఎంసి లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. మొక్కలను ప్లాంట్ ఇన్చార్జి టి దివాకర్ రావు నాటారు. మొక్కల వలన ఆరోగ్యానికి ఎంతోమేలు జరుగుతుందని ప్రతి ఒక్కరు కనీసం రెండు మొక్కలైనా నాటాలిఅన్నారు.
మొక్కలు నాటడంతో సమాజానికి మేలు జరుగుతుందని ఇన్ చార్జి దివాకర్ బాబు అన్నారు. అనపర్తి బి.ఎమ్.సి.లో మొక్కలు నాటేకార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలునాటడంవల్ల సమాజానికి మేలు చేకూర్చుతుందని కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మానవ సమాజానికి ఆధారమైన మొక్కల పెంపకంపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవాలల్సిన బాధ్యతను ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఎమ్.సి ఇన్చార్జి టి.దివాకర్ రావు, సూపర్ వైజర్ కె.శివ ప్రకాష్,ప్లాంట్ ల్యాబ్ అసిస్టెంట్ కొండబాబు, ఆపరేటర్ కృపారావు, పాలు ఏజెంట్స్ శ్రీదేవి మిల్క్ డైరీ శ్రీనివాసరెడ్డి,ట్రాన్స్ పోర్ట్ ఓనర్స్, డ్రైవర్, పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


