Mahatma Jyotirao Phule : మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి అంజలి నటించిన యస్.పి

TRINETHRAM NEWS

తేదీ : 11/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కృష్ణాజిల్లా యస్.పి కార్యాలయంలో జిల్లా యస్ పి ఆర్. గంగాధర రావు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది. ప్రజలలో అనాదిగా పాతుకుపోయిన విపక్షాలను నిర్మూలించడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు అని తెలిపారు.పూలే జయంతి సందర్భంగా యస్ పి మాట్లాడుతూ సామాజిక తత్వవేత్తగా అనేక మార్గాల్లో ప్రజలను చైతన్యం చేశారని, మహిళా విద్య ప్రాముఖ్యత గురించి , వితంతు పునర్వివాహం గురించి చెప్పడం జరిగింది.

ఈ ఒక్కరికి మరియు ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శం అన్నారు. పత్రిక ద్వారా పేదలు కార్మికుల సమస్యలు, సమాజానికి తెలియజేసేలా చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు అనగారిన వర్గాల అభ్యుదయానికి ఆయన చేసిన పోరాటం, విద్య హక్కు కోసం చేసిన ఉద్యమం దేశ చరిత్రలో నిలిచింది అని చెప్పారు. మహిళలకు, దళితులకు విద్యఅందించే దిశగా మొదటి పాఠశాలను స్థాపించిన మహానుభావుడిగా
ఆయన కీర్తి చిరస్మరణీయం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్ పి, అడ్మిన్ వీవీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mahatma Jyotirao Phule

You cannot copy content of this page

Scroll to Top