బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో
ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు దాగాం శ్రీనివాస్ అధ్యక్షతన పోచమ్మ గడ్డ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల వద్ద గల మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని పూల మాల వేసి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే గొప్ప సంఘసంస్కర్త, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన మహాయోధుడని, విద్య యొక్క ప్రాముఖ్యతను తెలిపిన మహాత్ముడు అని కొనియాడారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే ఆశయంతో ముందుకు సాగుతామన్నారు
ఈ కార్యక్రమానికి మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, సతారపు నారాయణ, దుర్గం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


