Gangamma Thalli Jatara : గంగమ్మ తల్లి జాతరకు ముహూర్తం ఖరారు

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: అల్లూరిజిల్లా అరకువేలి మండలం,యండపల్లివలస, గ్రామం(అరకు ఆర్ఎస్)లో వెలసి ఉన్న. శ్రీశ్రీశ్రీ గంగమ్మతల్లి ఆలయంలో, నవరాత్రి జాతర ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈసారి జాతర వేడుకలు మే 19-05-2025 వ తేదీ నుండి 27-05-2025 వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ ప్రకటించింది.
ఈ మేరకు యండపల్లివలస గ్రామస్తులు, గంగమ్మ తల్లి ఉత్సవ కమిటీ, రైల్వే శాఖ ఉద్యోగులు కలిసి సమావేశమై తుది తేదీలను నిర్ణయించారు. ఈ ఏడాది కూడా భక్తుల సహకారంతో, గ్రామస్తుల భాగస్వామ్యంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సన్నాహాలు చేపడతాది అని తెలిపారు.
జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆలయ ఆరాధనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gangamma Thalli Jatara Muhurat

You cannot copy content of this page

Scroll to Top