అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: గిరిజన మారుమూల గ్రామాల్లోని ప్రజలకు విద్య, వైద్యం, మెరుగైన జీవితం అందించాలని ఉద్దేశంతో పలురకాల కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే సింగపూర్ లోని ఒక స్కూల్లో అగ్నిప్రమాదం జరిగి కన్న కొడుకు గాయపడి ఆసుపత్రిలో చేరారు అని వార్త తెలిసి తక్షణమే అధికారులు వెళ్లాలని తెలియజేసినప్పటికి, గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం కురిడి గ్రామం , పర్యటిస్తానని,మనసులో ఆందోళన ఉన్న అడవి తల్లి బాట కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాతనే సింగపూర్ కు బయలుదేరారు. ఇది నాయకుడు లక్షణం, అది మా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొప్పతనం,నీ సైన్యం అయినందుకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది.
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి,కాళ్ళు, చేతులకు గాయాలైన విషయం మాకు ఎంతో ఆందోళన కలిగించింది సింగపూర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న చిరంజీవి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ప్రమాద విషయం తెలుసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి మార్క్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పడం,ఈ సంఘటన తెలుసుకొని ధైర్యం చెప్పిన, వివిధ పార్టీ నాయకులకు,చిరంజీవి మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన పార్టీ నాయకులకు, జనసేన శ్రేణులకు, అభిమానులకు, కార్యకర్తలకు, కూటమి పార్టీ నాయకులకు అందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి బొంకుల.దివ్యలత.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


