అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ బొండం పంచాయతీ కొత్తవలస శాఖ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో నిరసన.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు గత్తుం బుజ్జి బాబు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజలపై బాదుడు కార్యక్రమం ప్రారంభించిందన్నారు.ఎప్పుడు లేని విధంగా ఒకేసారి రూ.50 గ్యాస్ ధర పెంచి ప్రజల నడ్డివిరిచిందన్నారు.పుండు మీద కారం చల్లిన చందంగా ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్స్ బిగించి ట్రూ అఫ్, సర్దుబాటు, చార్జీల పేరుతో ప్రజాలపై విధ్యుత్ భారలు పెంచి నడ్డి విరుస్తూంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం.
పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు లక్షల కోట్లు రూపాయలు మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం సిగ్గుచేటన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ పథకం పైన కూడా భారం పడుతుంది. కాబట్టి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె. అప్పన్న,టి.జోషి మహిళా సంఘం నాయకులు జి.శాంతి ప్రియ జి. నీలమ్మ టి. సుందరమ్మ జి.పార్వతి జి.దేవి రేవతి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


