ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, పాడేరు నియోజకవర్గం లో, చింతపల్లి, జి కేవీధి, జి. మాడుగుల, పాడేరు లో ఎక్కువగా కాఫీ,మిరియాలు, పసుపు, అల్లం, పిప్పలు పైనాపిల్స్, వివిధ రకాల పంటలు పండుతూ ఉంటాయి. కానీ కొయ్యూరు మండలం కి వచ్చేసరికి ఇక్కడ జీడి,మామిడి తోటలు ఉన్నాయి. ఈ తోటల పంట మీదే రైతులు ఆదార పడి, అప్పులు చేస్తూ వుంటారు. ఫిబ్రవరి, మార్చి మాసంలో జీడి మామిడి తోటల పూత చాలా మంచిగా పూసి, రైతులలో ఆశలను పెంచి, తీరా పంట చేతి కొచ్చే సమయానికి, వాతావరణం లో మార్పు వల్ల పూత అంతా అగ్గితెగులు పట్టి రైతుల ఆశలను అడియాసలు చేస్తుంది. కొద్దో గొప్పో పంట పండితే, దానికి తోడు దళారీలు మోసాలు. మార్కెట్ లో రేటు ఉన్నప్పటికీ, రైతుల దగ్గర, తక్కువ రేటుకు కొనటం. మరియు తూకం విషయంలో మోసాలు.
ఈ రకంగా కొయ్యూరు మండలంలో రైతులకు ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. ప్రతీ యేటా ఇ లాంటి పరిస్థితే! కావున అదికారులు, జిల్లా కలెక్టర్,పిఓ మరియు మార్కెటింగ్ అధికారులు, ఈవిషయం పై దృష్టి పెట్టాలని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగునే చదువు కొని నిరుద్యోగులుగా, ఉన్న యువతకు ఈ తోటలనుండి వచ్చే పంటపై వ్యాపార మెలు కవలు నేర్పి, రైతులకు గిట్టుబాటు ధరకు వారితో కొనిపిస్తే, వాళ్లకు కొద్దిపాటి బ్రతుకు తెరువు అవుతుంది. రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. కావున దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి మా కొయ్యూరు మండల రైతులను ఆదుకోవాలని పెట్ల గాంధీ మీడియా ముందు డిమాండ్ చేసారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


