జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 13 at 2.07.13 PM

TRINETHRAM NEWS

భార్య ఆత్మహత్య.. భర్తను కొట్టిచంపిన బంధువులు!

Trinethram News : అచ్చంపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత మృతి ఘటనలో భర్తను మృతురాలి బంధువులు చంపారు. వివరాల్లోకి వెళ్తే..

స్థానికంగా ఉంటున్న సింధు, నాగార్జున మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని సింధు ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే బంధువులు ఆమెను నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు..

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఆమె మృతి చెందింది. అనంతరం మృతదేహంతో బంధువులు అచ్చంపేటకు తిరుగుపయనమయ్యారు. ఆమె మృతికి భర్తే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. శుక్రవారం అర్ధరాత్రి ఆమనగల్లు వద్ద నాగార్జునను సింధు బంధువులు కొట్టిచంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

You cannot copy content of this page