TRINETHRAM NEWS

తేదీ : 04/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలంలో విస్సన్నపేట నుండి నూజివీడు రోడ్డు మార్గంలో ఉన్నటువంటి కాకతీయ ఫంక్షన్ హాల్ లో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316 డి 2024,- 2025 వ సంవత్సరం దీపక్ వివేకనంద రీజనల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సంబంధిత డివిజన్, సంబంధించి లయన్స్ క్లబ్ లు హనుమాన్ జంక్షన్, తిరువూరు, విస్సన్నపేట, నూజివీడు , మైలవరం, తదితర క్లబ్ వారు పేద ప్రజలకు, ఆపదలో ఉన్నవారికి చేసిన సేవ + స్నేహం, సంగమం గురించి వారు తెలియజేయడం జరిగింది. ఏ సంవత్సరంలో లయన్స్ క్లబ్ లో చేరి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు ప్రజాసేవ చేశారో తెలిపారు. వినమ్ర పూర్వక విజ్ఞప్తి అంటూ లయన్ చెన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , సిహెచ్. వి. రమణారెడ్డి జిల్లాలోని వివిధ క్లబ్ ల సభ్యులందరికీ ఈస్ట్ ఇంపాక్ట్ క్లబ్ తరపున నమస్కారం మరియు, విన్నపం తెలియజేశారు.

2025 – 2026 లయని స్టిక్ సంవత్సరానికి ప్రథమ వైస్ జిల్లాల గవర్నర్ అభ్యర్థి గా యల్. యన్. వి. వి. యస్. వి. ప్రసాద్ మార్చి 9వ తేదీన నామినేషన్ వేశారు. తక్కువ సమయంలో జెడ్ సి గాను, ఆర్ సి గా వివిధ పదవులు అలంకరించి ఎంతోమంది గవర్నర్లకు సహాయసహకారాలు అందించడం జరిగింది.1987 వ సంవత్సరంలో గౌతమ విద్యానికేతన్ అనే తెలుగు మీడియం పాఠశాల స్థాపించి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దున ఘనత ఆయనది.
అదేవిధంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్యబ్యాసం కోసం ప్రతి ఏడాది ఒక్కొక్క విద్యార్థికి రూపాయలు పదిహేను వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ప్రతిసేవా కార్యక్రమంలో పాల్గొని కుట్టుమిషన్లు, తోపుడు బండ్లు, మూడు చక్రాల సైకిళ్లు మొదలైనవి అందజేశారు. రీజియన్ చైర్మన్ సహకారంతో 105 కుట్టుమిషన్లు , ఆరు గ్రైండర్లు ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా మధురానగర్ ప్రాంతంలో కొందరు పేదలకు ప్రతినెల మందులు వగైరా , వగైరా వంటివి కొనిచ్చారు. మంచి ఆలోచనతో సేవ యజ్ఞంలో భాగంగా ఒక లక్ష, 20వేల రూపాయలతో జిల్లాలో వృద్ధాశ్రమాలు, అనాధశ్రమాలలో దుప్పట్లు, టవల్స్ పంచడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎల్.యన్. ఆర్. వెంకటేశ్వర రెడ్డి, దంపతులు ఆర్. శ్రీవాణి ల ను సన్నాయి మేళాలతో, పూల వర్షాలతో వేదిక పైకి ఆహ్వానించడం జరిగింది.యన్.టి. వెంకటేశ్వరరావు వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. లయన్స్ క్లబ్ కు సంబంధించిన వారు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, నేను మీకు ప్రొఫెషనల్ డైనమిక్ ప్రొఫెషనల్ సినీ గాయకులు, జర్నలిస్టు, లీడర్ వై. రామేశ్వరరావు, జర్నలిస్టులు బే తినేని .సురేష్, తాడి. రంగారావు , తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deepak Vivekananda Region Meeting - 2