TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. దమ్మపేట మండలం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు కొమరం భీమ్ విగ్రహాలను ఆవిష్కరించిన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ సందర్బంగా విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లి చదువుపై అలసత్వం వహించకుండా ఇంటివద్ద చదువుతూనే వృత్తి విద్యాకోర్స్ లకు సంబందించిన సమ్మర్ క్యాంపులు వినియోగించుకోవాలన్నారు. అలాగే సరదా కోసం చెరువులు కుంటలవైపు వెళ్లి ఈత రాక ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దన్నారు.

తల్లిదండ్రులు కూడా వేసవి సెలవులలో పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనంతరం ఇదే పాఠశాలలో గత నెల ఆకస్మిక సందర్శనలో భాగంగా విద్యార్థులకు తాగునీటి సమస్యను తెలుసుకున్న సందర్భంలో వెంటనే బోర్ మోటార్ మంజూరు మంచినీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడుతూ ఈ రోజు నూతన మోటార్ ను స్విచ్ఛాన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ పి విశ్వనాధ్ కుమార్, పిఈటీ గోపాల్, ఉషారాణి, శ్రీనివాసరావు,మండల నాయకులు పర్వతనేని ప్రసాద్, చిన్నశెట్టి యుగంధర్, ముళ్ళపూడి వెంకటేశ్వరరావు,సాయిల నర్సి, పగడాల రాంబాబు, సుఘసాని శ్రీధర్, గ్రామశాఖ అధ్యక్షులు సిర్నెని వెంకయ్య, షాకీర్ పాషా, చీకటి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare unveils statues