High Court : సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

TRINETHRAM NEWS

మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు

Trinethram News : హైకోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన జిల్లా కలెక్టర్.. తనకున్న అధికారాన్ని ఉపయోగించి బాధితురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని ఆర్అండ్ఆర్ చట్టం ప్రకారం తనకు పునరావాసం కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రాజన్నసిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత అనే నిర్వాసితురాలు

సుదీర్ఘ కాలం విచారణ అనంతరం కవితకు అర్అండ్ఆర్ ప్యాకేజి ప్రకారం పునరావాసం కల్పించాలని తీర్పునిచ్చిన న్యాయస్థానం.. కోర్టు తీర్పు తీర్పు మేరకు తనకు పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ ను కోరిన బాధితురాలు.. కోర్టును తప్పుతోవ పట్టించి ఇల్లీగల్ ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో పిటిషనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వేములవాడ ఆర్డీవోకు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్

కలెక్టర్ ఆదేశాలతో బాధితురాలు కవితపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు.. తనకు జరిగిన అన్యాయంపై తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కవిత.. కోర్టు తీర్పును ధిక్కరించండమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసు నమోదు చేయడంపై సీరియస్ అయిన హైకోర్టు

కలెక్టర్ ను కోర్టుకు అటెండ్ కావాలని ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి.. నిన్న ఉదయం కోర్ట్ కి హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరైన కలెక్టర్, మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండకపోతే జైలుకు పంపుతామని ప్రభుత్వ తరపు న్యాయవాదికి చెప్పిన న్యాయమూర్తి.. మధ్యాహ్నం కోర్టుకు హాజరైన కలెక్టర్, 2 గంటల పాటు కోర్టులో నిల్చోపెట్టి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి

న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తప్పు అని ఎలా అంటారు, బాధితురాలిపై కేసు ఎలా నమోదు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ కలెక్టర్ ను అడిగిన న్యాయస్థానం.. తాము మాట్లాడిన మాటలు తప్పేనని ఒప్పుకొని బేషరతు క్షమాపణ కోరిన కలెక్టర్

క్షమాపణ చెప్పిన బాధితురాలిపై కేసు నమోదు చేయించిన ఘటనలో చర్యలకి సిద్ధంగా ఉండాలన్న న్యాయస్థానం.. కోర్టు సమయం ముగియడంతో విచారణ వాయిదా

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sircilla Collector Sandeep Kumar

You cannot copy content of this page

Scroll to Top