జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 12 at 5.25.23 PM

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్నారు—ఎమ్మెల్యే రాందాస్ నాయక్…

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం రైతు వేదిక భవనంలో నిరుపేద లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఆరు గ్యారంటీల పథకాన్ని అమలు చేసిందని ఉన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధికి పది కోట్ల రూపాయల కేటాయించడం అభినందనీయమని అన్నారు ఆ నిధులను గ్రామాల అభివృద్ధికి కేటాయిస్తా మనీ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మండల అధికారులు పాల్గొన్నారు

You cannot copy content of this page