రామగుండం మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41 వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల అనిల్ కుమార్ కుమార్తె సాయి సుదీక్ష కు ప్రతినెల 2000 వేల రూపాయల ప్యాకెట్ మనీ ని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా గురువారం రోజున గాంధీ నగర్ లోనిఎంబీబీస్ చదువుతున్న సాయి సుదీక్ష తండ్రి గద్దల అనిల్ కుమార్ కు 2000 వేల రూపాయల చెక్ ను అందజేసినట్లు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ సేవా స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 38 నెలల నుండి ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి నెల మొదటి వారంలో సాయి సుదీక్ష కు 2000 రూపాయల ప్యాకెట్ మని అందిస్తున్నామని మూడు సంవత్సరాలు నుండి సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులందరి సహకారంతో ప్రతి నెల ప్యాకెట్ మని అందిస్తున్నామని ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


