CPM Chaitanya Yatra : సిపిఎం చైతన్య యాత్ర

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 13 : అరకువేలి మండలం బస్కి పంచాయితీ బిజ్జగూడ గ్రామంలో సిపిఎం చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతూ, బిజ్జాగూడ గ్రామంలో మంచినీరు, సిసి రోడ్డు, అంగన్వాడి, భవనము సామాజిక భవనం నిర్మాణం చేయాలని గ్రామస్తులు తో డిమాండ్ చేశారు పివిటిజి గ్రామమైన బిజ్జగూడలో అనేక సమస్యలు నెలకొని ఉండడం బాధాకరం మా గ్రామంలో సిసి రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు నిలువ ఏర్పడి అనేక జబ్బులకు గురి అవుతున్నామన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి బిజ్జగూడ గ్రామంలో ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది .ఈ కార్యక్రమంలో సోడపల్లి ఆనంద్ సత్య రావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPM Chaitanya Yatra

You cannot copy content of this page

Scroll to Top