పార్టీ ఆవిర్భావ వేడుకలలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నీయోజకవర్గం. అనపర్తి: రాబోయే ఎన్నిక ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దే అని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు తెలియజేశారు.
15వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు . స్థానిక ఎర్రకాలువ వంతెన దిగువలో ఉన్న స్వర్గీయవైయస్ రాజశేఖర్ రెడ్డి, విగ్రహానికి పూలమాల వేసి ఘణనివాళులు అర్పించి పార్టీ జెండా ఎగురవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రేణుల మధ్య డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా సరే ప్రజల యొక్క మద్దతు తోటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది అని తెలియజేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వచ్చిన పార్టీ శ్రేణులకి అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి(రాంబాబు), బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, అనపర్తి సర్పంచ్ శ్రీమతి వారా కుమారి, అనపర్తి నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షులు కొండేటి భీమేశ్వర స్వామి, అనపర్తి నియోజకవర్గ లీగల్ విభాగం అధ్యక్షులు వెలగల లక్ష్మీనారాయణ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు సత్తిబాబు, అనపర్తి టౌన్ అధ్యక్షులు నల్లమిల్లి మురళి మోహన బాలకృష్ణారెడ్డి (మురళి), తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లభ శెట్టి రామ సతీష్, మళ్లీటి బులి వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ కర్రీ దాసు, రవి , సూర్యనారాయణ, వీరయ్య కాపు , మల్లిడి సునీల్ రెడ్డి, చింత శ్రీనివాసరెడ్డి, బుల్లియ్య, సత్తి పోతా రెడ్డి, ఎం సీ ఏ జిమ్మీ, శంకర్ బాబు , సాంబత్తుల చంటి, బొట్టు ముత్యాలరావు , తిరగటి శివ , సత్తి వెంకట రామారెడ్డి, సత్తి గంగిరెడ్డి, పెద్ద బుజ్జి , అబ్రహం, చింత రామారావు , సోమరాజు , చిన్న వెంకటరెడ్డి, అనపర్తి మండల సోషల్ మీడియా కన్వీనర్ దుర్గారెడ్డి, ఇబ్రహీం అధిక సంఖ్యలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వై యస్ ఆర్ సి పి) కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


