EVMs : ఈవీఎంలు అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే విజయం

TRINETHRAM NEWS

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే రుజువు చేశాయి

రాజమండ్రి పెద్ద ముత్తయిదువులా మాట్లాడే పారాచ్యూట్ లీడర్ భరత్ ఇది తెలుసుకోవాలి

2029 ఎన్నికల్లో కూటమికి రాజమండ్రి సిటీలో 83 వేల మెజారిటీ వస్తుంది

పరంపర కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పని భరత్

వైసీపీ అధికారంలో ఉంటే యువత గంజాయి,బ్లేడ్ బ్యాచ్ లతో తిరిగే వారు

ఇప్పుడు రాజమండ్రి ప్రశాంతంగా ఉంది

టీడీపి నాయకులు మజ్జి రాంబాబు… నక్కా దేవీ వరప్రసాద్
Trinethram News : రాజమహేంద్రవరం : ఈవీఎంలు అయినా బ్యాలెట్ అయినా కూటమిదే విజయమని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్ చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడుతూ వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎంత ప్రయత్నించినా రాష్ట్రలో 151 సీట్లు సాధించినా రాజమండ్రి సిటీలో 2019 ఎన్నికల్లో 33 వేల ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి భవాని గెలిచారని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో ‌ఆదిరెడ్డి శ్రీనివాస్ 73 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారని‌ చెప్పారు. ఆయన గెలుపు చూసి ఓర్వలేక అక్కసు తో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఈవీఎంల వల్ద గెలిచారని అనడం హాస్యాస్పదమని విమర్శించారు.

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో కనివిని ఎరుగని రీతిలో కూటమి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారుగదా భరత్ ఇలాగే మాట్లాడితే 2029 ఎన్నికల్లో రాజమండ్రి సిటీలో ఆ మెజారిటీ 83 వేలకు చేరుతుందని హెచ్చరించారు. అందుకే ప్యారాచ్యూట్ లీడరు‌ భరత్ ఉలిక్కి పడుతున్నాడని అర్థమై జనంనవ్వుకుంటున్నారని మజ్జి రాంబాబు ఎద్దేవా చేశారు. మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి ప్రజలు సీటు చీటీ చింపేయడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఇక పేపరుమిల్లు
పరంపర-1,2లో ఉద్యోగాలంటూ 111 మంది యువ కార్మికులకు పంగనామాలు పెట్టిన భరత్ వారినుంచి దండుకున్న లక్షలాది రూపాయలు స్వాహా చేశాడని పరంపర కార్మికులు మిల్లు ఎదుటే మీడియా ఎదుట అతని ముడుపుల బాగోతం బయటపేట్టారుకదా… దాని గురించి ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నించారు. ఆ కార్మికులను లోనికి పిలిచిన జైన్ మీరు డబ్బిచ్చిన ప్రవీణ్ చౌదరి, జయకృష్ణ, భరత్ మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చి వస్తే అప్పుడు నేను పై అధికారులతో మాట్లాడి మీ జీతం పెరిగేలా చేస్తానని చెప్పారట కదా…

నీవల్ల 112 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పేపరు మిల్లు గేటు దగ్గర కి వెళితే కార్మికులు తంతారని భయపడుతున్నావా? అని మజ్జి రాంబాబు నిలదీశారు. ఎమ్మెల్యే ఆడపిల్లలకు కనీసం గౌరవం ఇవ్వడంలేదని నువ్వు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎంపీ కాకముందు, ఏంపీ అయ్యాక నువ్వు ఎలా ప్రవర్తించావో నీ పార్టీ వారే కథలు,కథలుగా చెబుతున్నారు.‌ నీ కూడా తిరిగే మీ వాళ్ళలో ఒకరు మహిళలను లేపేస్తానని బెదిరిస్తే ఇంకొకడు చంపేస్తానని కోప్పడతాడని, అది అతని పార్టీ వాళ్ళే చెబుతున్నారకదా అన్నారు. ఇక నీ వీక్ నెస్ ఏమిటో రాజమండ్రి ప్రజలకు తెలుసని అన్నారు. ఎమ్మెల్యే‌ఆదిరెడ్డి కుమారుడిపై ఫేసుబుక్కులో తొలుత పోస్టులు పెట్టింది మీరేకదా అని ప్రశ్నించారు. ఆడపిల్లలకు ఒక న్యాయం మగపిల్లలకు ఒక న్యాయమా?

అని మండిపడ్డారు.‌ నక్కా దేవీవరప్రసాద్ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారంలో ఉంటే రాజమండ్రి ప్రశాంతంగా ఉంటుందని‌, కాని భరత్ అధికారంలో ఉంటే యువత గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లతో చెడిపోతారని రుజువైందని అన్నారు. బుధవారం వైకాపా వారు నిర్వహించేది యువత పోరు కాదు… వైకాపా వారి రాజకీయ నిరుద్యోగ పోరు అని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లు దావోస్ వెళ్లి కోట్లాది పెట్టుబడులు వచ్చాయన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శించారు. నగరంలో నాలుగు డివైడర్ లు, రెండు కప్పుసాసర్లు, ఆరు బొమ్మలు పెట్టించి అభివృద్ధి చేశానని చిన్న పిల్లాడిలా చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భరత్ చేసిన పనులు పేరుచెప్పి 25 శాతం కమీషన్లు ఎలా దండుకుంటున్నావో బహిరంగ రహస్యమే కదా అని నిలదీశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు యువతను గంజాయి, ఇతర మాదకద్రవ్యాల మత్తులో ముంచి ఒక్క ఉద్యోగం ఇవ్వని మీరా యువత తరుపున ఉద్యమించేది సిగ్గులేదూ అని ప్రశ్నించారు. ఫీజు రిఎంబర్సుమెంటు బబకాయిలు చెల్లించకుండా వదిలేసిన మీరు మీ పార్టీ తరుపున ఉద్యమం చేస్తారా? అని ప్రశ్నించారు. అదీ ఇంటర్ పరీక్షలు జరుగుతుంటే విద్యార్థులతో ఉద్యమాలేంటి.పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడుకండని హితవు పలికారు. విద్యార్థులు కూడా వైసీపీ ఆందోళనకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఇకనైనా ప్యారాచ్యూట్ లీడరు‌ భరత్
‌మతి భ్రమించిన మాటలు మానుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పొలాకి పరమేష్, బుడ్డిగ రవి, పిల్లి శ్యామ్, చింతపల్లి నాని, కందికొండ అనంత్, శివా రెడ్డి, వెల్లంకి జయరామ్, ఎస్ కె బషీర్, ఈతలపాటి రవి, ముద్రగడ జయరామ్, సనపతి సత్తిబాబు, కిలపర్తి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

EVMs or ballot papers

You cannot copy content of this page

Scroll to Top