MLA Jare : ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన చేసిన చేసిన ఎం ఎల్ ఏ జారే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం. అన్నపురెడ్డిపల్లి మండలం జానకీపురం, రంగాపురం, గ్రామాలలో రాష్ట్రప్రభుత్వం పేదప్రజలకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలలో భాగమైన ఇందిరమ్మ ఇండ్లను మండలంలో పైలట్ ప్రాజెక్టు గా ఎంపికైన ఊటుపల్లి పంచాయతీలో ఈ రోజు అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ శంకుస్థాపన చేసి నిర్మాణపనులు ప్రారంభించారు.

ఈ పైలట్ ప్రాజెక్ట్ గ్రామపంచాయతీలలో 45 రోజులలోపు ఇంటినిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం జానకీపురంలో సత్తెమ్మ తల్లి దేవాలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం వారి చేతులతో ప్రారంభించారు.మండల కేంద్రంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు ఆలయకమిటీ సభ్యులు గ్రామపెద్దలతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారపార్టీ నాయకులు, మండల అధికారులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

oundation stones of Indiramma houses

You cannot copy content of this page

Scroll to Top