MLA Raj Thakur : హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్

TRINETHRAM NEWS

రామగుండం మార్చి10//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం బి పవర్ హౌస్ గడ్డ రాజీవ్ రహదారి సమీపంలో ఉన్న భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ వారి సతీమణి మనాలి ఠాకూర్ పరిశీలించారు గతంలో ఈ గుట్టపై బయటపడిన హనుమాన్ విగ్రహం సందర్భంగా ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్- మనాలి దంపతులు 150 ఫీట్ల భారీ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దంపతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విగ్రహ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు నిర్మాణం జరుగుతున్న తీరును సదరు కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో హనుమంతుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు ఇదే క్రమంలో గుట్టపై బయటపడిన చిన్నపాటి విగ్రహం ప్రదేశంలోనే భారీ విగ్రహాం ఏర్పాటు కు రూపకల్పన చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రాంతానికి అభయాంజనేయస్వామి దీవెనలు ఎల్ల కాలం ఉండాలని, ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అన్నారు. వీలైనంత త్వరలో విగ్రహ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఆధ్యాత్మిక చింతనలో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA inspected the construction

You cannot copy content of this page

Scroll to Top