Super Six Schemes : సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయని కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

తేదీ : 08/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజవర్గం, ఏ కొండూరు మండలం, కొత్త రేపూడి గ్రామం లో ఉన్నటువంటి వైసిపి రాష్ట్ర కమిటీ సభ్యులు ఉప్పతల. రామకృష్ణ మాట్లాడుతూ. గత ప్రభుత్వం వైసిపి హాయంలో కులమత బేధం చూడకుండా ప్రతి ఒక్క కుటుంబానికి నవరత్నాలు, పథకాలు అందాయని గత ప్రభుత్వాన్ని పొగిడారు.

ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి గెలిచారని అనడం జరిగింది. ప్రజల్లో 60% వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. తను వైసిపి పార్టీ ఓడిపోయిన, గెలిచిన సరే ఆ పార్టీలోనే ఉండి జగన్మోహన్ రెడ్డికి సైనికుడిలా పనిచేస్తూ ప్రజలకు సమస్య వస్తే నా సమస్య అని పరిష్కారం అయ్యే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నానని చెప్పారు. ఎవరికి ఏదైనా సమస్య వస్తే అది నా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించే ప్రయత్నం లో ముందు ఉంటున్నానని, ప్రజాసేవ కోసం పార్టీలో పనిచేస్తున్న అని తెలిపారు. గెలుపు, ఓటమి అనేది సహజమే అయినా మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కుటుంబ సమేతంగా గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి. గ్రామస్థాయి నుండి రాష్ట్రం మరియు దేశంలోని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రజలందరూ సిరి సంపదలు కలిగి, సుఖ సంతోషాలతో ఉండాలని, దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Super Six schemes

You cannot copy content of this page

Scroll to Top