త్రినేత్రం న్యూస్ :మార్చ్ 6: నెల్లూరు జిల్లా : కావలి. రైతు హితంకోసం నిరంతరం శ్రమించే ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నేతృత్వంలో మంచి ప్రభుత్వం మనది మంచి వర్షాలు పడ్డాయి.. పంట బాగానే వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర కల్పిస్తే ఈ ఏడాది రైతుకు పరిపూర్ణ ఆనందం కల్పించినట్టే ప్రభుత్వ ధాన్యం కొనుగోలులో సింగిల్ విండో వ్యవస్థ ద్వారా మాత్రమే రైతుకు సత్వర ప్రయోజనం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుకు ఎదురౌతున్న ఇబ్బందులపై అసెంబ్లీ వేదికగా ప్రస్తావించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి,
రైస్ మిల్లుల వద్దే వ్యవసాయ, పౌర సరఫరా శాఖల సిబ్బంది మిల్లర్ల సమక్షంలో తేమ శాతాన్ని పరీక్షించి వెనువెంటనే గొనె సంచులు అందించి సంబంధిత మిల్లర్లు సరుకు దించుకునేలా చూడాలి అలా ఐతేనే సకాలంలో రైతులు తమ పంట అమ్ముకోవడంతోపాటు నిర్ణీత సమయంలో సరైన గిట్టుబాటుతో తమ రొక్కాన్నీ పొందగలరు
ప్రస్తుతం ఉన్న విధానమైతే ముందుగా వ్యవసాయ శాఖ వద్దకు ధాన్యం శాంపిల్ తీసుకెళ్లి తేమ శాతం చెక్ చేపించి తర్వాత పి ఏ సి యెస్ కేంద్రానికి వెళ్లి గోనెసంచులు తీసుకుని ధాన్యంతో మిల్లర్ వద్దకు వెళ్లాల్సి ఉంది
మిల్లర్లేమో తేమ శాతం అధికంగా ఉందని చెప్పి అడ్డగోలుగా కోతలు వేసి రైతుకు నష్టం చేస్తున్న పరిస్థితి ఉంది
ఈ పరిస్థితి నివారించేందుకు సంబంధిత శాఖల అధికారుల నిరంతర పర్యవేక్షణతో పాటు సిబ్బంది-మిల్లర్లను ఒకే చోట చేర్చి నాణ్యతా పరీక్షల అనంతరం రైతు పొలం నుంచి నేరుగా ఎంపిక చేయబడ్డ మిల్లర్ కు రసీదుతో సహా సరుకు పంపిస్తే రైతుకు సరైన గిట్టుబాటును సకాలంలో అందించినట్టు ఔతుంది
సంబంధిత శాఖల మంత్రి వర్యులు, మంత్రిత్వశాఖలు తగిన చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


