Janasena : సమన్వయ కర్తకు సమన్వయ ఆహ్వానం

TRINETHRAM NEWS

మన్యం జిల్లా పార్వతీపురం త్రినేత్రం న్యూస్ మార్చి 7 : మన్యం జిల్లా పార్వతీపురం, సాలూరు, మెంటాడ మండలాల్లో ఘన స్వాగతం పలికి దుశ్శాలు వాలతో,పూల బుకెళతో ఘనంగా ఆహ్వానం పలికిన జనసేన నాయకులు, జనసైనికులు. పార్వతిపురం,నియోజకవర్గంలో జనసేన పార్టీ P.O.C ఆధాడ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశం లో అరకు పార్లమెంట్ మరియు పాడేరు ఇన్చార్జి సమన్వయ కర్తగా వంపూరు గంగులయ్య హాజరయ్యారు,అనంతరం జనసేన ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించారు.

వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.ఈ సమావేశంలో పాలకొండ POC నిమ్మల నిబ్రాం,పార్వతీపురం ముఖ్యనాయకులు కడ్రాక మల్లేశ్వరరావు కూడా పాల్గొన్నారు.ఈ సమావేశంలో గంగులయ్య మాట్లాడుతూ ముఖ్యంగా ఈ నెల 14 వ తేదీన పిఠాపురంలో జరగబోయే 12 వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం (ప్లీనరీ)కి రాష్ట్ర నలుమూలల నుంచి జనసైనికులతో నిండిపోనున్నదని సర్వత్ర ఆశక్తి దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని మన పార్టీ అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత మొదటి ప్లీనరీ కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు,వీర మహిళలు, జనసైనికులు సంసిద్ధంగా ఉండాలన్నారు.

అధినేత ప్రసంగం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సగటు అభిమాని ఈ రాష్ట్రం అభివృద్ధి కోరుకునే ప్రతి విద్యార్థి ఎంతో వేచి ఉన్నారన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల.పవన్ కళ్యాణ్. పై వైసీపీ అధినేత,జగన్ మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం.వంపూరు గంగులయ్య మండిపాటు. సంక్షేమం అనే పేరు చెప్పి డబ్బు దోచుకోవడంలో నీ స్థాయి చాలా ఎక్కువా…జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి మరియు సామాన్య ప్రజలకు న్యాయం చేయడంలోని నీ స్థాయి చాలా తక్కువ.తుగ్లక్ రెడ్డి.అని మండి పడ్డారు.21సీట్లు వచ్చిన వ్యక్తి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అయితే 11సీట్లు వచ్చిన నువ్వు వర్డ్ నెంబర్ కి ఎక్కువ కార్పొరేటర్ కి తక్కువ అవుతావ్ జగన్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ జగన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి రాష్ట్ర ఆర్థిక స్థితి దివాలా చేసిన దొంగ నేడు ఎటువంటి అవినీతి ఆరోపణలు,కేసులు లేని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉప ముఖ్యమంత్రి పై అతని ద్వేషం ఏమిటో అర్థం చేసుకోవచ్చు అందుకేనేమో రాష్ట్ర ప్రజలు11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు.అదే విధంగా మేము అనాలనుకుంటే జైలు కి ఎక్కువ బెయిల్ తక్కువ అవినీతి అతనికెంతో మక్కువ..అనొచ్చు..వీధి రౌడికి ఎక్కువ ప్యాక్షన్ఇస్ట్ కి తక్కువ అనొచ్చు.. కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ, చరిత్రలో అత్యంత నేర స్వభావం వున్న వ్యక్తి కేవలం జగన్ మోహన్ రెడ్డి నే విషయం ఇవాళ దేశానికి మొత్తానికి తెలిసిందే అంటు జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా.. వంపూరు గంగులయ్య మండిపడ్డారు..

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరందరూ హాజరై జనసేన శక్తి నీ చాటలన్నారు. సాలూరు లో మన్యం జిల్లా పార్వతీపురం, సాలూరు, మెంటాడ మండలాల్లో ఘన స్వాగతం పలికి దుశ్శాలు వాలతో,పూల బుకెళతో ఘనంగా ఆహ్వానం పలికిన జనసేన నాయకులు, జనసైనికులు.
ఈ సమావేశంలో పాలకొండ POC నిమ్మల నిబ్రాం,పార్వతీపురం ముఖ్యనాయకులు కడ్రాక జనసైనికులతో నిం సంసి.ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరందరూ హాజరై జనసేన శక్తి నీ చాటలన్నారు.అనంతరం సాలూరు 11వ శతాబ్దంకి సంబంధించిన పురాతన స్వయంభు గా వెలిచిన శివలింగం భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి(శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఆ శివయ్య చల్లని ఆశిస్సులు ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా అష్టైశ్వ్యాలతో ఉండాలని, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ విజయవంతం అయ్యేలా ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామి వారి కరుణ కటాక్షాలు చల్లని దీవెనలు కలగాలని కోరారు..పార్వతి పురం,సాలూరు నియోజకవర్గం, నాయకులు,వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top