TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యూస్ బ్యూరో

అభిమానం చాటుకున్న విద్యార్థి బండారు నిహాల్..

స్పెషల్ ఎట్రాక్షన్ గా బర్త్డే కేక్…

అశ్వారావుపేట, మార్చ్ 1, (తెలంగాణం ):టాలీవుడ్ నటుడు పుష్ప -2 తో రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆయన్ని అందరూ అభిమానిస్తుంటారు. తాజాగా అశ్వారావుపేట మండలానికి చెందిన లెర్న్ ఫర్ లైఫ్ స్కూల్ (Learn for life school) లో 4 వ తరగతి చదువుతున్న 9 సంవత్సరముల బండారు నిహాల్ తన పుట్టినరోజు సందర్బంగా 5 కేజీ ల కేక్ పై తన ఫోటోతో పాటు అల్లుఅర్జున్ ఫోటో పెట్టించి అభిమానాన్ని చాటుకున్నాడు.

అల్లు అర్జున్ ఫోటోతో ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ వారి స్వగృహం లో స్నేహితులు ముందు కట్ చేసి పంచారు. ఈ కేక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులకు, బండారు నిహాల్ అభినందనలు తెలియజేసారు. తమ స్నేహితుల మధ్యన జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandaru Nihal in birthday celebrations