Trinethram News : అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది.
నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. వారిలో 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఇక మొత్తం అభ్యర్ధుల్లో 92 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష మొత్తం 2 పేపర్లకు జరిగింది. ఈ రెండు పేపర్లకు ఆబ్జెక్టివ్ టైప్‌లో ప్రశ్నలు ఇచ్చారు. పరీక్ష జరిగిన రోజునే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్సర్ కీలను కూడా విడుదల చేసింది.
వీటితోపాటు అభ్యర్ధుల రెస్పాన్స్‌షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ప్రశ్నలు, జవాబులపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి 27వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు లేవనెత్తాలని కమిషన్ కోరింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


