జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం అద్దంకి నార్కట్ పల్లి బైపాస్ పై చింతపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది.

హైదరాబాదు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న పెళ్లి బస్సు ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొన్నది.

ట్రాక్టర్ పై ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని మిర్యాలగూడలోని వర్షిత హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సులో 36 మంది ఉన్నారు.

ప్రమాదానికి అధిక వేగమే కారణమని తెలుస్తుంది. సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fatal road accident

You cannot copy content of this page