జూన్ 27, 2026

WhatsApp Image 2025 02 08 at 14.51.36

TRINETHRAM NEWS

12 వ తేదీనే ఏజెన్సీ బంద్. ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ – మొట్టడం రాజబాబు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్ : ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు 1/70 భూబదాలయింపు నిషేధ చట్టం సవరణ చెయ్యాలన్న వివాదస్పదమైన వ్యాఖ్యలపై, రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్ ఈ నెల 12 వతారీఖునని ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు స్పష్టం చేసారు.
ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి రాష్ట్ర మరియు జిల్లా కమిటీలు సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నెల 12 వ తేదిన ఒక్కరోజు మన్యం బంద్ కు పిలుపునివ్వడం జరిగింది.
దానికి అనుబంధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు  ఏక తాటిపైకి వచ్చి అఖిలపక్ష మీటింగ్ పెట్టి పిబ్రవరి 11, 12 తేదీలలో రెండు రోజులు బంద్ కు పిలుపు ఇచ్చినట్లు మీడియా ద్వారా తెలియవచ్చింది. అందరు ఏక తాటిపైకి రావడాన్ని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి స్వాగతిస్తుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి సుదీర్ఘంగా చర్చించి, కరపత్రాల, గోడ పత్రికలు, బ్యానర్లు కూడా ముద్రించడం జరిగింది. జెఏసి జిల్లా కమిటీలతో సమన్వయ పరిచి తీసుకున్న పిబ్రవరి 12 వ తేదిన ఒక్క రోజు బంద్ కార్యక్రమంలో ఏవిధమైన మార్పు లేదు. కావున జెఎసి సభ్యులు పిబ్రవరి 12 వ తేదిన ఒక్క రోజు బందు విజయవంతం చేయడానికి సమాయత్తం కావాలని, కరపత్రాలు, బ్యానర్లు, గోడ పత్రికలు గ్రామాలలోకి చేర్చడానికి బాధ్యతలు తీసుకోవాలని మొట్టడం రాజు బాబు పిలుపునిచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Motdam Rajababu

You cannot copy content of this page