TRINETHRAM NEWS

పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం జన సైనికుల ప్రత్యేక పూజలు

Trinethram News : రాజమండ్రి, ఫిబ్రవరి 6: అస్వస్థతకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్య. మంత్రి,జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కల్యాణ్ కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ గురువారం జనసేన నాయకులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవీచౌక్ లోని బాలాత్రిపుర సుందరిదేవి ఆలయం, ఉమా బసవ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.తమ అభిమాన, ప్రియతమ నేత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సూర్య బయ్యపునీడి, విక్టరీ వాసు, చక్రపాణి,విన్నా వాసు, ఠాగూర్ , రాంబాబు, చిట్టిబాబు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Puja for Pawan Kalyan