వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన ఎన్కేపల్లి రైతులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన ఎన్కేపల్లి రైతులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్, మా భూములను కబ్జా చేసి ప్లాట్లు చేస్తున్నారు, అడిగితే రౌడీలతో చంపుతామని బెదిరిస్తున్నారు. మా భూములు మాకు ఇప్పించి న్యాయం చేయాలని పూడూరు మండలం ఎనకేపల్లి దళిత రైతులు వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ కు వినతి పత్రం సమర్పించారు.

పత్రాలు పరిశీలించిన అదనపు కలెక్టర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం నాడు పూడూరు మండలం ఎంకేపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు మన్నెగూడ పెంటయ్య, కంతల భీమయ్య, బుజ్జమ్మ, ఆనందం, మాలే భీమయ్య, విజేందర్, పులేందర్, తదితరులు తమ పూర్వీకుల నుండి సంక్రమించిన ఇనాం పట్టా సర్వేనెంబర్ 115 లో రియాల్టర్ లు అయిన బర్కత్ అలం ఖాన్, తండ్రి హైమత్ అలం ఖాన్, మళ్లీ యువరాజు, హైదర్, సుధాకర్ రెడ్డిలు మైరాన్ వెంచర్ పేరుతో తమ భూములను అక్రమంగా ఆక్రమించి మీ పూర్వకలు మాకు అమ్మినారంటూ కొందరి పేర్లపై తప్పుడు పత్రాలు సృష్టించి మొత్తం 19 ఎకరాల భూమిని కబ్జా చేశారని, అందులో అమ్మని భూమి 14 ఎకరాలకు కూడా రాత్రికి రాత్రి బౌండర్ నిర్మించారని, అడగడానికి వెళ్ళిన తమపై ప్రైవేట్ రౌడీలతో చంపుతామని బెదిరిస్తున్నారని వారు అదనపు కలెక్టర్ కు తెలిపారు. అయితే సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్ లింగా నాయక్ ఆర్డీవో ద్వారా విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top