జూలై 23, 2026

WhatsApp Image 2024 01 07 at 11.12.54 PM

TRINETHRAM NEWS

వైసిపి అధ్యక్షుడు చావా పై ఫిర్యాదు

Trinethram News : 7th Jan 2024 గంపలగూడెం మండల
మండల వైసీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్న చావా వెంకటేశ్వరరావు పై ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. గత కొన్ని రోజులుగా వైసిపి సోషల్ మీడియాలో ఎమ్మెల్యే అభ్యర్థుల పోస్టింగ్ల విషయంలో తునికిపాడు గ్రామానికి చెందిన మండల సోషల్ మీడియా ప్రతినిధి దారెల్లి రవితేజ (నాని) కి, అదే గ్రామానికి చెందిన బాణావతు బాలకృష్ణల మధ్య కొన్ని విషయాలు సోషల్ మీడియా వేదికగా కొనసాగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై చావా కల్పించుకొని అందులో ఒకరైన రవితేజ ను సదరు గ్రూపు నుండి అడ్మిన్ అయిన చావా వెంకటేశ్వరరావు తొలగించినట్లు తెలిపారు. అదేమని ఆదివారం మధ్యాహ్నం చావాకు ఫోన్ చేసి బాధితుడు రవితేజ ప్రశ్నించగా, నువ్వు ఎంత? నీ కథంతా? నన్ను ఫోన్ చేసి అడిగే స్తాయా? అంటూ దుర్భాషలాడినట్లు అందులో పేర్కొన్నాడు.అంతే కాదు లక్ష రూపాయలు ఖర్చు చేసైనా నిన్ను నడిరోడ్డుపై నరికిస్తానని అన్నట్లు తెలిపారు. నీపై 100 కేసులు బనాయించి, బొక్కలో నెట్టిస్తానని, ఈ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా, నిన్ను శాశ్వతంగా తిరిగి రాకుండా చేసే దమ్ము నాకు ఉందంటూ, రకరకాలుగా దుర్భాషలాడినట్లు ఆ ఫిర్యాదులో రవితేజ పేర్కొన్నారు. సదరు విషయమై వైసిపి అధ్యక్షుడు చావా వెంకటేశ్వర పై చర్యలు చేపట్టి తగు న్యాయం చేయాలని కోరారు. పై విషయాలను పేర్కొంటూ, సదర్ జిరాక్స్ కాపీని మీడియాకు అందజేశారు.

You cannot copy content of this page