MLA Matsyarasa Visvesvara Raju : గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘిస్తే ఖబడ్దార్! – ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు

TRINETHRAM NEWS

గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘిస్తే ఖబడ్దార్! – ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లాఇంచార్జ్ : గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘిస్తే ఖబడ్దార్!
శాసనసభ స్పీకర్, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన పాడేరు శాసన సభ్యులు, మత్స్యరాస విశ్వేశ్వర రాజు. అయ్యన్న పై రాష్ట్రపతి, గవర్నర్ కు పిర్యాదు చేస్తాం.

గిరిజన ప్రజలు హక్కులను ఉల్లంఘించి మాట్లాడిన అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఖండించిన పాడేరు శాసన సభ్యులు , మత్స్యరాస విశ్వేశ్వర రాజు. తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో శాసన సభ్యులు మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి జీవనాడి లాంటి జీవో 1/70 ఇది రాజ్యాంగం కల్పించిన చట్టం. అలాంటి గిరిజన ప్రజలకు ఉన్నట్టువంటి జీవో నీ విశాఖపట్నం లో నిర్వహించిన సదస్సులో అరకు చలి ఉత్సవాలు పేరుతో శాసన సభ స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు 1/70 సడలించాలని చేసినా వ్యాఖ్యలపై పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు తీవ్రంగా ఖండించారు, గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే 1/70 సడలిలిస్తేనే చెందుతుందా? ప్రభుత్వం పెట్టుబడులతో అభివృద్ధి చెయ్యండి, మైదాన ప్రాంతంలో మైనింగ్ చేస్తున్న అయ్యన్న పాత్రుడు ఇప్పుడు గిరిజన ప్రాంతంలో కన్ను పడిందా మా గిరిజన ప్రజల చట్టాలు హక్కులు జోలికి వస్తె నాకున్న ఎమ్మెల్యే పదవికి పక్కన పెట్టి, ఎంతటి ఉద్యమానికి కైన సిద్ధమేనని అన్నారు.
అయ్యన్న పాత్రుడు 1/70 సడలిస్తనంటే గిరిజన ప్రాంతంలో ఉన్న కూటమి నాయకులు ఏమాత్రం నోరు మేధపట్లేదు ఇదేనా మన గిరిజన ప్రాంత ప్రజలపై మీకున్న గౌరవం. రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి సంక్షేమం చెయమని ఇచ్చారు. చేతనైతే మీరు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి అంతే కానీ గిరిజన ప్రాంతంలో ఉన్న చట్టాలపై భంగం కలిగించే విధంగా గురి పెడితే మాత్రం ఊరుకునిదే లేదని అయ్యన్న పాత్రుడు పై శాసన సభ్యులు మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు తీమోతి, సర్పంచ్ గబ్బడి చిట్టి బాబు, మాజీ సర్పంచ్ శరభ సూర్యనారాయణ, సీనియర్ నాయకులు పి.రాజేష్,భూర మహేష్ , కూడ సుబ్రమణ్యం, మహిళా అధ్యక్షురాలు ఊర్వశీ రాణి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top