జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 29 at 17.08.33

TRINETHRAM NEWS

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది..

అభివృద్ధికి స్థానిక ప్రజలు సహరించాలి, నేతాజీ నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే గోరంట్ల…

Trinethram News : East Godavari : ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం బొమ్మూరు గ్రామ శివారు నేతాజీ నగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు పనులు జరుగుతున్నాయని, అభివృద్ధి జరుగుతున్న సమయంలో స్థానికులు సహకరించాలని తగాదాలు పడకూడదని తెలిపారు.

ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఈ ప్రాంతం నందు మెయిన్ డ్రెయిన్ పనులు త్వరలో మొదలు పెడతామని, ఈ మురుగు నీరు మొత్తం ధవలేశ్వరం వద్దకు చేరుతుందని, అక్కడ పంప్ హౌస్ నిర్మించే విధంగా చర్యలు చేపడుతున్నామని, పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చాలి కావున కొంత సమయం పడుతుందని, వరదల సమయంలో మురుగునీరు కాలనీలోకి ప్రవేశించకుండా కాంక్రీట్ వాల్ నిర్మించవలసిన అవసరం ఉందని, వీటన్నిటిని పుష్కరాల నాటికి పూర్తి చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు.

స్థానికుల అభ్యర్థన మేరకు కొండ ప్రాంతమైన ఖాళీ కృష్ణ నగర్ రోడ్డు నుండి బృందావన కాలనీ వద్ద దిగుటకు ఆక్రమణలు తొలగించి, విశాలమైన రోడ్డు నిర్మించేందుకు స్థలాన్ని సర్వే చేసి అంచనాలు సిద్ధం చేయాలని, అలాగే 10, 11 వీధులను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అక్కడ నిర్మాణం జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం తె.దే.పా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, ఎం.పి.డి.వో డి.శ్రీనివాస్, పి.అర్ డి.ఈ.రవి, జె.ఈ సంపత్ కూమర్, పంచాయతి కార్యదర్శి కాశీ, భీమరశెట్టి రమేష్, కామిని‌ భాస్కర్, పిల్లా తనూజా, పలివేల‌ సత్యనారాయణ, పితాని రాజు, రాయుడు సునీల్, మరడాపు రాంబాబు,రాయుడు అలేఖ్య, మెట్ల వెరియ్య, విజయ్, అడ్డాల శ్రీను, యార్లగడ్డ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page