జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 29 at 16.33.33

TRINETHRAM NEWS

ఎం.జీ.ఎం.(పి.పీ. యూనిట్)ను పరిశీలించిన – డి.ఐ.ఓ.డాక్టర్.ఐ.ప్రకాశ్.

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 29 జనవరి 2025, వరంగల్ ఎం.జీ.ఎం. హాస్పిటల్ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీ.పీ.యూనిట్)ను వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన వరంగల్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్. ఐ. ప్రకాశ్. ఎం.జీ.ఎం.లో వ్యాధి నిరోధక టీకాలు నిల్వ చేసే కోల్డ్ చైన్ సిస్టంను రికార్డులు పరిశీలించారు.

ఈ సందర్భంగా డాక్టర్.ఐ.ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని సిబ్బందికి తెలియజేశారు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరాల పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని, చలి తీవ్రత ఎక్కువగా ఉందని ఇలాంటి సమయంలో బయట తిరుగడం మంచిది కాదని తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విద్యాసాగర్ ,ఏ.ఎన్.ఎం. లక్ష్మీబాయి ,రామ రాజేష్ ఖన్నా మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page