షెడ్యూల్ ప్రాంతంలో టూరిజం కాదు, ( ట్రైబలిజం ) ముఖ్యం. ఆదివాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. – మొట్టడం రాజుబాబు.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : షెడ్యూల్ ప్రాంతంలో టూరిజం కాదు, ట్రైబలిజం (ఆదివాసిజం) ముఖ్యమని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యాలను ఉద్దేశించి అన్నారు.విశాఖపట్నంలో ఆంధ్ర్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 1/70 చట్టం సడలిస్తే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని, వివాదస్పదమైన వ్యాఖ్యలపై భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, భూబదాలయింపు నిషేధచట్టం చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని,ఆ చట్టాన్ని సవరిస్తే షెడ్యూల్ ప్రాంతం పూర్తిగా నాశనమౌతుందని,చట్టం ఉన్నప్పుడే అమలు చేయకపోవడంతో ఉల్లంఘన జరుగుతోందని,చట్టమే సవరిస్తే మన్యం అధోగతేనని,ఇప్పటికైనా ఆదివాసీలు అర్థం చేసుకోవాలని ఆటగాళ్లు మారుతారు, గానీ ఆట తీరు మారదని,గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాక్సైట్ మైనింగ్ తవ్వకాలు చేపట్టాలనకొన్నారని,ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అదే పందా కొనసాగించారని, అయితే ఆదివాసీల పోరాటాలతో ఆపగలిగామన్నారు.
ఆదివాసీల మీద ప్రభుత్వాలు పోరాటాలు చేస్తున్నాయని, మధ్య భారతం లో జరుగుతున్న పోరాటమెందకో బుద్ధి జీవులు ఆలోచించాలని, అలాగే భవిష్యత్ లో బాక్సైట్ మైనింగ్ తవ్వకాలు ఈ ప్రాంతంలో జరగవని, గ్యారంటీ ఎవరిస్తారని,మిని మైనింగ్ పేరుతో నల్లరాయి,గ్రానైట్,లేటరైట్ వంటి మైనింగ్ తవ్వకాలను త్వరలో చేపడతారని,మైనింగ్ మాఫియా మన్యంలోకి ప్రవేశిస్తుందని,ఆదివాసీలను పార్టీల పేరుతో విడగొట్టి పబ్బం గడుపుకొంటారని,అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5 పంచాయితీలు మినహా మిగిలిన ప్రాంతమంతా పూర్తిగా షెడ్యూల్ ప్రాంతం, కానీ ఈ జిల్లాకు ఆదివాసీ పోరాట యోధుడు పేరు పెట్టకపోవడతోనే నష్టం జరుగుతుందని అర్ధం చేసుకోవాలి.సంసృతి,సాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు కలిగిన ఆదివాసీ ప్రాంతాల్లో టూరిజం పెట్టి వ్యభిచారం చేస్తున్న వారికి ప్రభుత్వంలో ఉన్న కొందరు బ్రోకరిజం చేయడం పొరపాటిగా జరుగుతుందని,అల్లూరి సీతారామరాజు జిల్లా లో సరియపల్లి లో భూబదాలయింపు నిషేధ చట్టానికి వ్యతిరేకంగా 100 కోట్లతో కన్వెన్షన్ సెంటర్,డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్ నిర్మాణం చేసేందుకు చేసుకొన్న ఒప్పందం వెంటనే రద్దు చేయాలని, ప్రస్తుతం స్పీకర్ పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడుకి ఆదివాసీల స్థితిగతులు బాగా తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కూటమి ప్రభుత్వంలో తెదేపా, జనసేన, బిజెపి ఆదివాసీనాయకులు తీవ్రంగా వ్యతిరేకించాలని, ఆయన మీడియా ముందు డిమాండ్ చేసారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App